OTT Releaes: రేపు ధియేటర్ కు పోటీగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్..!
సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యింది లేదు. గతవారం రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రం, ఒకే ఒక జీవితం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫాం చేస్తున్నాయి. అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని… వంటి సినిమాల పై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.టాక్ వస్టే కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ వీకెండ్ కూడా ఒకే ఒక జీవితం,బ్రహ్మాస్త్రం వంటి సినిమాలే క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఓటీటీ కూడా థియేటర్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. ఈ వీకెండ్ కు కూడా అదిరిపోయే సినిమాలు/ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. రేపు ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు / సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి : 1) కిరోసిన్ : ‘బిగ్ హిట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధృవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16 నుండీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.